| 5th schedule song |
|
రచన: పి ఎస్ అజయ్ కుమార్, ౫వ షెడ్యుల్ సాధన కమిటి
(మలయాళం "వరిగా వరిగా సహజరే" పాట లాగా పడాలి)
కదం కదం కలుపుతూ పదం పదం పడుతూ
అడుగులోన అడుగు వేసి సాగి ముందు పోదామా
దుష్ట శక్తులోచ్చిన దుఖమెంత కలిగిన
అలిసిపోక సోలసిపోక సాగిముండు పోదామా
సోదరీ ... సోదరా ...
ఎన్ని నాళ్లు బాధ పడుతూ బతుకు బండి లగేదాం
మరిన్ని నల్లు కుమిలిపోతూ కుంగి పూటు బతుకుతాం
భయం లేదు జయం మనదే కదిలి రండి కలిసి రండి
జయం మనదే, జయం మనదే, జయం మనదే సోదరా
సోదరా ... సోదరీ ...
సోదరీ ... సోదరా ...
ఏజన్సీకి చెందకుడా ఎందుకుండిపోవలె
ఆదివాసీ హక్కులేక అలమటించి పోవాలె
నాన్-షెడ్యుల్ ఆదివాసీలందరోకటి కదిలి రండి
జయం మనదే, జయం మనదే, జయం మనదే సోదరా
సోదరా ... సోదరీ ...
సోదరీ ... సోదరా ... భూమిపైన హక్కులేదు అడవి మనకు చిక్కలేదు
ఆదివాసీ హక్కులల్లో ఒక్కటైనా దక్కలేదు
నాన్-షెడ్యుల్ గిరిజనుడ నేటికిన కదిలిరా
జయం మనదే, జయం మనదే, జయం మనదే సోదరా
సోదరా ... సోదరీ ...
సోదరీ ... సోదరా ...
మనపిల్లలు చదివినారు ఆశలెన్నో పెంచినారు
రిజర్వేషన్ హక్కులేక నీరసించి పాయినారు
నాన్-షెడ్యుల్ గిరిజనుడ నేటికిన కదిలిరా
జయం మనదే, జయం మనదే, జయం మనదే సోదరా
సోదరా ... సోదరీ ...
సోదరీ ... సోదరా ... ఆంధ్రప్రదేశం లోన నేడు అలమటిస్తున్దేవడురా
నాన్-షెడ్యుల్ ఆదివాసీ బాధలేమిటో చూడరా
రాజ్యాంగపు హక్కులేని ఆదివాసీ సోదరా
జయం మనదే, జయం మనదే, జయం మనదే సోదరా
సోదరా ... సోదరీ ...
సోదరీ ... సోదరా ...
అంగట్లో అన్నివున్న అందలేదు నికురా
ఆదివాసీగా పుట్టి హక్కులేని సోదరా
పల్లె పల్లె తిరుగుదాం -- పల్లెలన్ని తిరుగుదాం
జయం మనదే, జయం మనదే, జయం మనదే సోదరా
సోదరా ... సోదరీ ...
సోదరీ ... సోదరా ...
మన కోసమే వుందిరా 5వ షెడ్యుల్ కమిటిరా
కమిటి అంటే కమిటిరా మన బ్రతుకుల దిమిటిరా
నం-షెడ్యుల్ గిరిజనుడ నేటికిన కదిలిరా
జయం మనదే, జయం మనదే, జయం మనదే సోదరా
సోదరా ... సోదరీ ...
సోదరీ ... సోదరా ... for more lyrics of movement songs, visit: |
| < Prev | Next > |
|---|